Wednesday, 4 November 2026

శాసనసభ్యత్వం రద్దుపై ఇచ్చిన తీర్పును.. 

ఎందుకు అమలు చేయటం లేదు
– వారం రోజుల్లో స్పష్టత ఇవ్వాలి
– తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌
– తదుపరి విచారణ ఆగస్టు 3కు వాయిదా
హైదరాబాద్‌, జులై27(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ల శాసనసభ్యత్వం రద్దుపై గతంలో ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు విచారించింది. ప్రభుత్వ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ రామచందర్రావుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘విూరు ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్నారా లేక పార్టీ న్యాయవాదిగా ఉన్నారా’ అని ప్రశ్నించింది. తమ తీర్పును ఎందుకు అమలు చేయలేదో వారం రోజుల్లో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని సూచించింది. స్పష్టత ఇవ్వని పక్షంలో అసెంబ్లీ కార్యదర్శి, అసెంబ్లీ లా లెజిస్టేట్‌ సెక్రటరీలు కోర్టులో హాజరుకావాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 3కు వాయిదా వేశారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం సమయంలో కాగితాలు విసిరేశారనే నెపంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ కుమార్‌ల సభ్యత్వాన్ని తెరాస ప్రభుత్వం రద్దు చేసింది. దీనికితో మరో 11మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్‌ చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వాదనలు విన్న హైకోర్టు సస్పెండ్‌ ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. దీంతో ప్రభుత్వం రిఫిటీషన్‌ వేసినా ఫలితం లేకపోయింది. కోర్టు ఆదేశించినా ఎమ్మెల్యేలపై విధించిన సస్పెండ్‌ను ఎత్తివేయ కపోవటంతో పాటు గన్‌మెన్‌లను తొలగించింది. దీంతో మరోసారి ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించడంతో శుక్రవారం విచారించిన కోర్టు తెలంగాణ ప్రభుత్వం తీరుపై మండిపడింది. వెంటనే తీర్పు అమలు చేయాలని, లేకుంటే ఎందుకు అమలు చేయలేదో వారం రోజుల్లో స్పష్టం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. మళ్లీ విచారణ ఆగస్టు 3కు వాయిదా వేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
—————————–