Tuesday, 3 November 2026

శాసనసభ.. 52 గంటల 29 నిమిషాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రెండు దఫాలుగా జరిగిన అసెంబ్లీ సమావేశాలు 20 రోజుల పాటు కొనసాగాయి. 20 రోజుల్లో 52 గంటల 29 నిమిషాలు సభ కొనసాగింది. ఈ సమావేశాల్లో 14 బిల్లులు ఆమోదం పొందాయి. సభలో జరిగిన చర్చల్లో 96 మంది సభ్యులు పాల్గొన్నారు. ఒకే అంశంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఈ సమావేశాల్లో వివిధ పార్టీలు తీసుకున్న సమయం .. కాంగ్రెస్‌ 25 గంటల 23 నిమిషాలు, టీడీపీ 11 గంటల 48 నిమిషాలు టీఆర్‌ఎస్‌ 6 గంటల 9 నిమిషాలు , వైసీపీ 3 గంటల 55 నిమిషాలు తీసుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *