Tuesday, 3 November 2026

శిరీష హత్యకు సహకరించిన వ్యక్తి అరెస్ట్‌

హైదరాబాద్‌,మే14(జ‌నంసాక్షి): నగర శివారులోని ప్రగతి రిసార్ట్స్‌ లో డిగ్రీ విద్యార్థిని శిరీషను హత్యచేసిన కేసులో మరొకరిని అరెస్ట్‌ చేశారు. ఆమె స్నేహితుడు సాయిప్రసాద్‌ అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాన నిందితుడు సాయిప్రసాద్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా మరో నిందితుడు షేక్‌ అబ్దుల్‌ మజీద్‌ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కొత్తూరు మండలం తిమ్మాపూర్‌ కు చెందిన మజీద్‌.. శిరీష హత్యకు సహకరించినట్లు పోలీసుల విచారణలోతేలింది. దాంతో అతన్ని శంకరంపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు.