సూర్యాపేట,మే14(జనంసాక్షి): సూర్యాపేట కలెక్టరేట్ ముందు ఉదయం పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంకన్న అనే రైతు భూ సమస్య పరిష్కరించాలంటూ పురుగుల మందు తాగాడు. అధికారుల చుట్టూ తిరిగినా తనని పట్టించుకోవడం లేదని మనస్థాపం చెంది పురుగులమందు తాగాడు. స్థానికులు వెంకన్న అడ్డుకుని సూర్యాపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వెంకన్న స్వస్థలం ఎస్ ఆత్మకూరు మండలం తుమ్మల పెన్‌పహాడ్ గ్రామం. ఇప్పుడు అతని పరిస్థితి నిలకడగా ఉంది.




