శివకాశి సేవా యువ సైన్యం సంస్థ ఆర్థిక సాయం

పేద వారి అండగా ఉంటున్న:భూక్య కాశీరాం నాయక్

డోర్నకల్ ఆగస్టు-14 (జనంసాక్షి న్యూస్)

డోర్నకల్ మండలంలోని హున్య తండా గ్రామానికి చెందిన భూక్య సామ్య ఇటీవల కాలంలో మరణించగా వారి కుటుంబాన్ని శివ కాశీ సేవా యువ సైన్యం వ్యవస్థాపకులు భూక్య కాశీరాం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో శివకాశి సేవ యువ సైనికులు భూక్యా చంద,వగ్య పండు,రాంబాబు, అశోక్,రమేష్,చిన్న, సుమన్,రత్న, సుధాకర్,గుగులోత్, రాజు,లింగ,నాను, విజయ్,బొడ, మోతీలాల్,జర్పుల లక్ష్మణ్,రవి తదతరులు పాల్గొన్నారు.

తాజావార్తలు