అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 27
అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ శివనగర్ కాలనీలో వాటర్ పైప్ లైన్ లీకేజీ అవడంతో మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు కాలనీలో పైపులైన్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ అనంతరం కాలనీ వాసులు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి కాలనీలో మంచినీటి సౌకర్యం సిసి రోడ్లు డ్రైనేజీలు మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కృషి చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ అరుణ్, కాలనీవాసులు జనార్ధన్,దేవయ్య గౌడ్, శంకరయ్య, స్థానిక నాయకులు అనంతల సంతోష్, పెంటన్న, మల్లేష్, రామకృష్ణ, లక్ష్మి, ఉదయ, స్వప్న, శ్యామల, తదితరులు పాల్గొన్నారు.




