సొంతగూటికి చేరిన కమల దళం

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్27(జనంసాక్షి)

తెరాస పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలు గుడ్డిగా నమ్మి కమలం నుండి తెరాస లో చేరిన నాయకులు తిరిగి కమలం గూటికె చేరారు. శుక్రవారం 20కి పైగా నాయకులను బీజేపీ జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామచందర్ రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి కండువాలు కప్పి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. తెరాస చేస్తున్న మోసాలను చెప్పుడు మాటలను నమ్మవద్దని ఆమె కోరారు. బీజేపీలో తిరిగి చేరినవారిలో వడ్డేపల్లి మహేష్,ఏర్పుల విజయ్, వల్లపుదాసు ప్రవీణ్,పేరాల నరేష్, రేఖం రామకృష్ణ, కైరంకొండ శివ, కోటేశ్వరరావు, బండి మల్లేశ్వరరావు తదితరులు ఉన్నారు.