శోకసంద్రంలో మహేశ్వరం

జనం సాక్షి : నర్సంపేట
నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామం శోక సంద్రంలోకి మునిగిపోయింది.ఆ గ్రామానికి చెందిన వీరమల్ల మన్విష్ రెడ్డి(7) దసరా పండుగ నిమ్మిత్తం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి సంతోషంగా గడిపి రాత్రి సమయంలో నిద్రస్తున్న సమయంలో చిన్నారిని పాము కాటు వేసింది.ఇలా జరిగినా వెంటనే చిన్నారిని హాస్పిటల్ కి చికిత్స నిమిత్తం నర్సంపేట కి తరలించారు.అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో హన్మకొండ కి తీసుకెళ్లి అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కి వెళ్లారు. అక్కడికి వెళ్లిన లాభం లేకుండా పోయింది.చిన్నారిని మృత్యువు ఈ రోజు కాటు వేసింది.చిన్నారి మృతి చెందటంతో తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు,గ్రామస్తులు విషాదఛాయాలోకి వెళ్లారు. అలాగే అదే గ్రామానికి చెందిన మాడుగుల జ్యోతి ఉదయం గుండె పోటుతో మరణించింది.
ఇలా ఇద్దరు గ్రామానికి చెందిన వారు తుదిశ్వాస విడవటంతో మహేశ్వరంలో విషాదఛాయలు అలుముకున్నాయి.