హైదరాబాద్ : డా. శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ 61వ వర్థంతి సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాజపా సీనియర్‌నేత వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… ముఖర్జీ అశయాలను యువత కొనసాగించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా జయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు, తర్వాత జాతీయస్థాయిలో రాజకీయ పునరేకీకరణలు ఉంటాయన్నారు.




