శ్రీధర్ బాబు గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండల మైనారిటీ ఆత్మీయ సమ్మేళనాన్ని బుధవారం మంథని పట్టణ కేంద్రంలో నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు అక్బర్ ఆలీ, కో-ఆప్షన్ సభ్యుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమీల్ అహ్మద్ లు హాజరై మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యేగా శ్రీధర్ బాబు గెలుపే లక్ష్యంగా ప్రతీ ఒక్కరు కష్టపడి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల చూపించే పట్టుదల, కృషి,నీతి,న్యాయం మన సంస్కారం ప్రజలకి తెలుసునని అన్నారు. నియోజకవర్గ మైనారిటీల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి శ్రీధర్ బాబు అని అన్నారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించడం లో కేసిఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. మంథని నియోజకవర్గ స్థాయిలో మైనారిటీ కి ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వని ఘనత జెడ్పీ చైర్మన్ కె దక్కుతుందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే పేద మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనం మండల మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ అలీమ్, మంథని మున్సిపల్ మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ ఎజాజ్, కో ఆప్షన్ సభ్యులు నిజాం తో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.