Wednesday, 4 November 2026

శ్రీశ్రీశ్రీ బద్రినారాయణ స్వామి పీఠాధిపతి కన్నుమూత

చింతలపాలెం —  జనంసాక్షి

 సూర్యాపేట జిల్లా,చింతలపాలెం మండలం,వజినేపల్లి గ్రామంలో ధవళగిరి శ్రీశ్రీశ్రీ బదరీనారాయణ స్వామి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ నారాయణ తీర్థ స్వాములు ది.30.09.22,శుక్రవారం ఉదయం 8:55 నిమిషాలకు శ్రీమన్నారాయణ సాయిధ్యాన్ని పొందారు. శ్రీబదరీనారాయణ స్వామి ఆశ్రమంలో ఉంచిన పార్ధీవ శరీరాన్ని దర్శించేందుకు చాలా రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖులు,భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.శుక్రవారం సాయంత్రం ఆలయం సమీపంలో వారి బృందావనానికి ఏర్పాట్లు చేసినట్లు వారి శిష్యులు తెలియజేసినారు.
Attachments area