Tuesday, 3 November 2026

శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయం లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు

 చౌటుప్పల్ (జనం సాక్షి):
చౌటుప్పల్ మండల దండు మల్కాపురం గ్రామంలో ఉన్న శ్రీ ఆంథోల్ మైసమ్మ దేవస్థానము లో మైసమ్మ అమ్మ వారిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భముగా ఆలయ కార్య నిర్వహణాధికారి చిట్టెడు వెంకట రెడ్డి స్వాగతం పలుకుతూ, అర్చకులచే పూజా కార్యక్రమములు జరిపించి తీర్థ ప్రసాదములను అందజేశారు. శేష వస్త్రాలలో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమములో చౌటుప్పల్ జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ వెలువర్తి యాదగిరి, మర్రిగూడ మాజీ ఎంపీపీ, చౌటుప్పల్ కౌన్సిలర్లు, దండుమల్కాపురం మాజీ సర్పంచ్ పబ్బురాజు బాయి, ఆలయ అర్చక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.