శ్రీ కృష్ణాష్టమి జన్మదినం సందర్భంగా స్వామి దేవాలయం వేడుకలను ఘనంగా నిర్వహించారు

శ్రీ కృష్ణాష్టమి జన్మదినం సందర్భంగా చింతకాని చేన్నకేశవ స్వామి దేవాలయం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఉట్టి కొట్టే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తిచేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి పెద్ద ఎత్తున శ్రీకృష్ణ భక్తులు, మహిళలు, యువకులు, పిల్లలు తరలివచ్చారు.ఈ కార్యక్రమం లో రైతుబంధు కమిటీ సభ్యులు కిలారు మనోహర్, ధమ్మాలపాటి వెంకటేశ్వర్లు, ఆలయ కార్యనిర్వహణ అధికారి చుండూరి రామకోటేశ్వర రావు, జూనియర్ అసిసెంట్ సిద్దెల నాగరాజు , సర్పంచ్ బండి సుభద్ర తదితరులు పాల్గొన్నారు.