Wednesday, 4 November 2026

శ్రీ చైతన్య స్కూల్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

జహీరాబాద్ ఆగస్ట్ 18( జనంసాక్షి) శ్రీ కృష్ణాష్టమి వేడుకలు పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణంలోని పాస్తాపూర్ చౌరస్తా సమీపంలోని శ్రీ చైతన్య స్కూల్ లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారి విద్యార్థులు శ్రీకృష్ణుని గొల్ల భామల వేషధారణ లు వేసి నృత్యాలు చేశారు. చిన్నారులు వేసిన నృత్యాలు పలువురుని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీణ ఉపాధ్యాయులు మహేష్, శ్రీలత, దుర్గ ప్రసాద్, మౌనిక, మానస విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు