శ్రీ ప్రసన్న ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపనకు రూ. 51వేల విరాళం. మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్.

తాండూరు, జూలై 26(జనంసాక్షి) పట్టణ సమీపంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో శ్రీ ప్రసన్నాంజనేయ విగ్రహ ప్రతిష్టాపనకు మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ రూ. 51వేల విరాలని అందజేశారు. వచ్చేనెల ఆగస్టు 10, 11, 12న చేపట్టే శ్రీ ఆంజనేయ విగ్రహం, ధ్వజస్తంభం నవగ్రహల ప్రతిష్టాపనకు మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ బుధవారం తనవంతు గా రూపాయలు 51 వేల విరాళాన్ని వార్డు కౌన్సిలర్ వెంకన్న గౌడ్ ఆలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు టి సాయప్ప, అధ్యక్షులు మునీందర్ సభ్యులకు లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ కాలనీలో శ్రీ ప్రసన్నాంజనేయం విగ్రహ ప్రతిష్టాపనకు తన వంతుగా విరాళాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గం లోని దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నర్సింలు ముదిరాజ్, ఎస్ వెంకట్ రెడ్డి, సంజీవరావు శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

తాజావార్తలు