శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి 51 వేల విరాళం.

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు.
తాండూరు సెప్టెంబర్ 13 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం వాల్మీకి నగర్ లో కొలువుదీరిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని మంగళవారం వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వైస్ చైర్ పర్సన్ దీప నర్సింహులు శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు ఆలయ అభివృద్ధికి తనవంతుగా 51 వేల విరాళాన్ని ప్రకటించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకో వాలని సూచించారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి భక్తి భావన్ని చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో కౌన్సిలర్, రఘు, రవీందర్ ,సంతోష్ గౌడ్ చంటి యాదవ్, ఆలయ కమిటీ అధ్యక్షులు, దర్మిది రవిశంకర్, పూజారి పాండు మరియు కమిటీ సభ్యుల శరణం సునీల్, కిరణ్ ముదిరాజ్, నరహరి, వీరన్న, బాలు చారితదితరులు ఉన్నారు.