సొసైటీ మాజీ డైరెక్టర్ లాల్సింగ్ పార్థివదేహాన్ని ఘన నివాళులు అర్పించిన -ప్రజాప్రతినిధులు
కురవి సెప్టెంబర్-13 (జనం సాక్షి న్యూస్)
కురవి మండలం నారాయణపురం గ్రామంలోని ధరావత్ తండా కు చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎఫ్ఏసిఎస్ కురవి మాజీ డైరెక్టర్ లాల్సింగ్ మంగళవారం అనారోగ్యంతో స్వర్గస్తులయ్యారు. వారి పార్థివ దేహానికి ఘన నివాళులు అర్పించిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు బజ్జురి పిచ్చిరెడ్డి,కురవి మండల అధ్యక్షుడు తోట లాల్లయ్య.అలాగే వారి కుటుంబ సభ్యులు మాజీ ఎంపీటీసీ ధారవత్ మాలి-రూప్ సింగ్ ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆయన వెంట కురవి ఆలయ చైర్మన్ రాము నాయక్, ఎఫ్ఏసిఎస్ చైర్మన్ దొడ్డ గోవర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు పట్టాభి రాజు, ఎంపీటీసీ బద్రు, రాజోలు గ్రామ సర్పంచ్ షేక్ మస్తాన్, వార్డు సభ్యులు అత్తునూరి నాగన్న, రాచగొల్ల సత్యనారాయణ, నారాయణపురం ఉప-సర్పంచ్ ధారవత్ భాస్కర్, వాల్మా,భాస్కర్,రవి తదితరులు ఉన్నారు.