శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో చండీయాగం
బషీరాబాద్ అక్టోబర్ 9,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో మైల్వార్ గ్రామంలో గ్రామ శివారులో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో చండీయాగం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి హాజరయ్యారు. గత నాలుగు సంవత్సరాల నుండి కర్ణాటక వాసులు మరియు పూజారి చంద్రకాంత్ ఆధ్వర్యంలో చండీయాగం చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి విచ్చేసిన జెడ్పి చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి కి శాలువాతో సన్మానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిలవగానే వచ్చినందుకు సంతోషం ఉందని ప్రత్యేక కృతజ్ఞతలు పూజారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, జెడ్పిటి శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి,వైస్ ఎంపీపీ జెడల అన్నపూర్ణ, వివిధ గ్రామాల సర్పంచులు, కర్ణాటక భక్తులు,యువకులు,గ్రామస్తులు, గ్రామ పెద్దలు హన్మంత్ రెడ్డి, ప్రభులింగం,దినేష్ రెడ్డి, గోపాల్,గోవింద్,విష్ణుమూర్తి, బలరాం నాయక్, టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
Attachments area