మన ఊరు మన బడి పనులను సత్వరమే పూర్తి చేయాలి

మరిపెడ, అక్టోబర్ 09(జనం సాక్షి ):మనఊరు మన బడి పనులను మండల వ్యాప్తంగా సత్వరమే పూర్తి చేయాలని  ఎస్ఎఫ్ఐ నాయకులు పెద్దబోయిన వీరబాబు డిమాండ్ చేశారు.ఆదివారం మండలంలోని గుండె పూడి హై స్కూల్, తానం చెర్ల హై స్కూల్, మరిపెడ హైస్కూల్ వివిధ స్కూల్లో బడిబాట పనులను పరిశీలించారు, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచి శుభవార్త కానీ నత్తనడకన పనులు జరుగుతున్నాయి పనులు వేగవంతం చేయాలని అన్నారు,బడిబాట నిధులను వృధా చేయొద్దని విద్యార్థులకు టాయిలెట్స్, వాటర్ సౌకర్యం టాప్స్ తరగతి గదిలో ఫ్యాన్స్ సౌకర్యం, ట్యూబ్ లైట్ల సౌకర్యం, పెచ్చులూడిపోతున్న భవనం తరగతి గదులను విద్యార్థులకు అనుగుణంగా నిర్మించాలని వారు డిమాండ్ చేయడం చేశారు,విద్యార్థులకు అనుగుణంగా నిధులను ఖర్చు చేయకపోతే భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిధులను దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేశారు, ఉన్నత అధికారులు ఎప్పటికప్పుడు పనులను పరిశీలించాలని వారు డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ నాయకులు శ్రీకాంత్ రవి కుమార్, సంపత్,శశాంక్, పరశురాములు, ప్రదీప్,సాయి,బాలు,రాజీవ్, ప్రణయ్, వినయ్, సుదీర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.