శ్రీ వైకుంఠాపుర వాసునికి ప్రత్యేక పూజలు నిర్వహించి టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్
ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం
స్వామి వారి శేష వస్త్రాలతో సన్మానం
సంగారెడ్డి బ్యూరో జనం సాక్షి ఆగస్టు 5
సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీవైకుంఠపురంలో కొలువైయున్న స్వామివారికి శనివారం టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చింతా ప్రభాకర్ కి వైకుంఠపురం ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు ఆలయంలోని దేవత మూర్తులను దర్శింపజేసి పూజలు నిర్వహించారు. స్వామివారి శేష వస్త్రాలతో చింత ప్రభాకర్ నీ సన్మానించి, వేద మంత్రాలతో ఆశీర్వచనములను చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తదనంతరం ఆలయ పూజారులతో కలిసి ఆలయ ఆవరణంలో పర్యటించారు.
ఆలయ సిబ్బంది రోడ్డు లేక వర్షాకాలం భక్తులు ఇబ్బందులు పడుతున్నారని చింతా ప్రభాకర్ దృష్టికి తీసుకువచ్చారు. అందుకు సానుకూలంగా స్పందించిన చింతా ప్రభాకర్ కలెక్టర్ తో మాట్లాడి రోడ్డు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సి.డి.సి చైర్మన్ కసాల బుచ్చిరెడ్డి , జెడ్పీటీసీ కొండల్ రెడ్డి, రాంరెడ్డి, చర్యల ప్రభాకర్, నర్సింలు, శ్రావణ్ రెడ్డి,ఎర్రోళ్ల చిన్న,విఠల్ తదితరులు పాల్గొన్నారు.