శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

మల్దకల్ ఆగస్టు 18 (జనంసాక్షి) మల్దకల్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ హరికృష్ణ,ఆర్ ఐ రామకృష్ణ సిబ్బంది సుబ్రహ్మణ్యం గౌడ్, సాయి వీరితో పాటు నడిగడ్డ గౌడ సంఘం మల్దకల్ మండలంఅధ్యక్షుడు వీరేష్ గౌడ్ ,గౌరవ అధ్యక్షుడు వీరన్న, గౌడ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.