కులమతాలకు అతీతంగా పాపన్న గౌడ్ జయంతోత్సవాలు జరుపుకోవాలి : ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్డగౌని రామ్మోహన్ గౌడ్
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) శ్రీ సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 372వ జయంతి సందర్భంగా చింతలకుంట ప్రలవి గార్డెన్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్డగౌని రామ్మోహన్ గౌడ్ , బి ఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్ ముఖ్య అతిధులుగా పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ మన తెలంగాణ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా జరుపుకోవడం సంతోషకరమని, కులమతాలకు అతీతంగా పాపన్న గౌడ్ జయంతోత్సవాలు జరుపుకోవాలని తెలిపారు .ఈ సందర్భంగా నివాళులు అర్పించిన వారిలో అఖిలభారత గౌడ సంఘం అధ్యక్షులు పేరం నాగేశ్వర రావు గౌడ్ , వనస్థలిపురం పోలీస్ ఇన్స్పెక్టర్ కోలా సత్యనారాయణ , కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్ పర్సన్ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ , పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మాన్ సింగ్ , కొత్త రవీందర్ గౌడ్ , బొంగు రఘు గౌడ్, కొత్త మహేష్ గౌడ్ , బాలకృష్ణ నాయీ , గడల రాజు నాయీ , ముద్దగౌని ధనపాల్ గౌడ్, నేలపట్ల యాదగిరి గౌడ్ , బొమ్మ రఘురాం నేత , డేరంగుల కృష్ణ, ఇరిగె రమేష్, మల్లేష్ గౌడ్,బుడ్డ సత్యనారాయణ, ఖాజా శ్రీనివాస్ , ఖాజా లక్ష్మి తదితరులున్నారు.
Attachments area
|