ఖైరతాబాద్ : ఆగస్టు 08 (జనం సాక్షి) హైదరాబాద్ కు చెందిన శ్వాన్ టర్బైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పవర్ ప్లాంట్లు, పెట్రో కెమికల్స్, స్టీలు, ఫెర్టిలైజర్స్, సిమెంటు, పేపర్ తదితర పరిశ్రమలకు అంతర్జాతీయంగా సేవలు అందిస్తుంది. ఓవర్ హాల్స్, రీఫర్బిష్మెంట్లు, విడిభాగాలు, సేవలు, మరమ్మతులు, రెట్రోఫిట్లు, ఎరక్షన్, కమిషనింగ్, రీఇంజనీరింగ్, పవర్ ప్లాంట్ల రీలొకేషన్ తదతర సేవలు అందిస్తుంది. దశాబ్ద కాలానికి పైగా విద్యుత్తు, గ్యాస్, సిమెంటు, స్టీలు, ఎరువులు, కాగితం, రాగి, ఔషధ పరిశ్రమలకు 21 మ్యాన్ ఇయర్స్ అనుభవంతో నిపుణులైన ఉద్యోగులతో సేవ చేస్తోంది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో శ్వాన్ టర్బైన్ సర్వీసెస్ వారి రెండో ప్లాంటును తెలంగాణ రాష్ట్ర ఆర్థిక , వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మెదక్ ఎంపీ కె.ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే జి.మహిపాల్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్వాన్ టర్బైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ పి.సత్యనారాయణ మాట్లాడుతూ మంత్రి టి.హరీష్ రావు ఈ ప్లాంటును ప్రారంభించడానికి వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నామన్నారు. ఈ ప్లాంటు ఈ ప్రాంతంలో 300 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తుందని గౌరవ మంత్రివర్యులకు నేను హామీ ఇస్తున్నామన్నారు. మా సాంకేతిక, ఇంజనీరింగ్ సామర్ధ్యం, నాణ్యతకు పెద్దపీట వేయడం, సమయానికి డెలివరీ ఇవ్వడం, కస్టమర్లకు పూర్తి సంతృప్తి ఇవ్వడం అనే బలాల పునాదుల మీదే మా వ్యాపారం మొదలైందన్నారు. మేం భారతదేశంతో పాటు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాల్లోనూ సేవలు అందిస్తున్నామన్నారు. శ్వాన్ టర్బైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది బీహెచ్ఎల్, సీమెన్స్, టీడీపీఎస్, జీఈ, స్కోడా, ఆల్మ్, హెచీసీ, ఎలియట్, డాంగ్ఫాంగ్, ఎస్ఈసీ, షాంగు తదితర సంస్థలకు నాన్ ఓఈఎం విడిభాగాలు అందిస్తుందన్నారు. స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు మేము కొన్ని వందల ఉత్పత్తులు తయారుచేశాన్నారు. 1000 మెగావాట్ల స్టీమ్ టర్బైన్, సెంట్రిఫ్యుగల్ కంప్రెసర్లు, ఎక్స్పాండర్లు, గేర్డ్ కంప్రరెసర్లకు విడిభాగాలను పూర్తిస్థాయిలో సరఫరా చేయగల అతిపెద్ద సంస్థగా శ్వాన్ టర్బైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిలబడిందని తెలిపారు.
శ్వాస్ టర్బైస్ సర్వీసెస్ రెండో ప్లాంటును ప్రారంభించిన – మంత్రి హరీష్ రావు




