షాదీఖానా నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రజా ప్రతినిధులు.
ఏర్గట్ల ఆగస్టు 29 (జనంసాక్షి ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో సోమవారం మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు షాదీఖానా నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డిని అడిగిన వెంటనే మైనార్టీ సోదరులకు షాదీఖానామంజూరు చేశారని కావున మనమందరము ఎంతో రుణపడి ఉండాలని తెలియజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, జెడ్పిటిసి గుల్లే రాజేశ్వర్, సర్పంచ్ గుల్లే లావణ్య, ఎంపిటిసి మధు,మండల టిఆర్ఎస్ అధ్యక్షులు రాజా పూర్ణానందం, గ్రామశాఖ అధ్యక్షులు తుపాకుల శ్రీనివాస్ గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షులు బద్దం ప్రభాకర్, మైనార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.