ఎల్బీనగర్ ( జనంసాక్షి )అఖిల భారత విశ్వకర్మ మహాసభ ప్రధాన కార్యదర్శి సంకోజు లింగాచారి కి విశ్వకర్మ జయంతి సందర్భంగా జాతీయ విశ్వకర్మ ఉత్తమ సేవా రత్న అవార్డు ఇస్తున్న రిషిత డాన్స్ అకాడమీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వకర్మలలో ఎంతోమంది పేదవారు ఉన్నారు వారిని ఆదుకోవాలని మన హక్కులను మనం సాధించుకోవాలని,రాజ్యాధికార దిశలో నడవాలని మనపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, 69 జీవో వెంటనే రద్దు చేయాలని సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత విశ్వకర్మ మహాసభ అధ్యక్షులు బ్రహ్మశ్రీ కౌలే జగన్నాథం , ఆవంచ మురళి , పడాల సతీష్ , శ్రీ వాణి , బెజ్జంకి ప్రభాకర్ , మద్దోజు సుధీర్ బాబు, ఉరిమిల్ల విశ్వం అతిరథ మహారధులు పాల్గొన్నారు
సంకోజు లింగాచారి కి జాతీయ విశ్వకర్మ ఉత్తమ సేవా రత్న అవార్డు




