ఎల్బీ నగర్( జనం సాక్షి ) రామకృష్ణాపురం డివిజన్,సరూర్ నగర్ లో టెలిఫోన్ కాలనీ చౌరస్తా లో స్వాతంత్ర సమరయోధుడు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి సందర్భంగా రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న గణేష్ నేత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ఆ మహానీయునికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేప భాస్కర్ రెడ్డి* గారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి,స్వరాష్ట్రం కోసం పరితపించిన తొలితరం ఉద్యమకారుడు, న్యాయవాది,మాజీ మంత్రివర్యులు,రాజకీయాలకు వన్నెతెచ్చిన మహానుభావుడు అని కొనియాడారు. తెలంగాణ లో ఒక జిల్లా కు కొండా లక్షణ్ బాపూజీ పేరు పెట్టాలని, జల దృశ్యం లొ బాపూజీ శృతి వనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ఎసి సెల్ కన్వినర్ బండి మధుసూదన్ రావ్ రాష్ట్ర యువజన నాయకులు చిలక ఉపేందర్ రెడ్డి,నల్లంకి ధనరాజ్ గౌడ్, గట్ల రవీంద్ర,తల్లాటి రమేష్ నేత,జిల్లా జగన్నాధం,పున్న కృష్ణయ్య,సిహెచ్ మహేందర్,శివి చక్రవర్తి,చిలువేరు కృష్ణ, గుర్రం శ్రీనివాస్,గజం చంద్రశేఖర్,గజం జగదీష్, జల్లా రాఘవేంద్ర,జ్ఞానేశ్వర్ యాదవ్,శేఖర్ ముదిరాజ్, సయ్యద్ ఆఫజల్,బొడ్డుపల్లి మహేందర్, సల్లంగి శ్రీనివాస్,సీతారాములు,శశికాంత్ రెడ్డి,సాయి, కిరణ్,శ్రీకాంత్ రెడ్డి, జహంగీర్,ప్రేమ్ నాయక్,విప్లవ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ :కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి




