సంగారెడ్డి నియోజకవర్గంలో నేటితో ముగిసిన ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా
దరఖాస్తులు చేసుకున్న వారికి లర్నింగ్ లైసెన్స్ అందజేస్తాం
టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్
సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , జూలై 29 ::
టీఎస్ హెచ్ డి సి ఛైర్మెన్ చింతా ప్రభాకర్ అధ్వర్యంలో నియోజకవర్గ యువతీ యువకులకు సొంత నిధులతో ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ పంపిణీ కార్యక్రమం శనివారం కూడా కొనసాగింది, ఈ కార్యక్రమం 11రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది.
నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 14900 డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తులు వచ్చాయి.
అందులో సుమారు ఆటో డ్రైవర్స్ 270, రైతులు(ట్రాక్టర్) 150, దివ్యంగులు 450, మహిళలు 1800 వరకు ఉన్నారు.
ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ
సోమవారం 31 ఆగష్టు నుండి దరఖాస్తు చేసుకున్న వారికి లెర్నింగ్ లైసెన్సులు అందజేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు మాజీ సి డి సి చైర్మన్ విజయేందర్ రెడ్డి, నాయకులు శ్రవణ్ రెడ్డి, వెంకటేశ్వర్లు, పరుశురాం సింగ్, మోహన్ నాయక్, రామ్ రెడ్డి తదితరులు బి ఆర్ సి నాయకులు పాల్గొన్నారు.