సంత్ శ్రీశ్రీ బాబా లకిసా బంజారా 444 వ జయంతి

ఖైరతాబాద్ : ఆగస్ట్ 28 (జనం సాక్షి) పర్యటక భవన్ లో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి పి.చరణ్ సింగ్ ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ఆజాదిగా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బంజారా స్వతంత్ర సమరయోధుడు, ఢిల్లీ రాయ్ సీనా హిల్ వారసుడు సంత్ శ్రీశ్రీ బాబా లకిసా బంజారా 444 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినందుకు యావత్ భారతదేశ బంజారాలను ఏకమత్యం చేసి ఒక తాటిపై తెచ్చి మాకు బంజారాల సాంస్కృతిక భాష నృత్యాలను గౌరవిస్తూ దశా దిశా చూయించి  ఢిల్లీలోని తాలుకోట్రా స్టేడియంలో ఘనంగా, నిర్వహించినందుకు యావత్ బంజారా సమాజం కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మాత్యులు జి.కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.