సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగ దోహదం చేస్తుంది.

మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి.

రాజన్నసిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 10, (జనం సాక్షి). సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా దోహదం చేస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి అన్నారు. శనివారం తెలంగాణ యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల యోగాసనం క్రీడా పోటీలను మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యోగా శారీరక మానసిక సమస్యలను రూపుమాపి సంపూర్ణ ఆరోగ్యం కోసం దోహదం చేస్తుందని అన్నారు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడేపు రవీందర్, రాష్ట్ర యోగ అసోసియేషన్ సెక్రెటరీ మనోహర్ జిల్లా యోగ అసోసియేషన్ గురువు ఉప్పల శ్రీనివాస్, గుడ్ల రవీందర్, వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులు క్రీడాకారులు పాల్గొన్నారు.