సంపూర్ణ ప్రజా సంక్షేమం అందిస్తున్న బి ఆర్ ఎస్ పార్టీ వైపే ప్రజలందరూ: వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”
వికారాబాద్ రూరల్ జూలై 21 జనం సాక్షి
సంపూర్ణ ప్రజా సంక్షేమం అందిస్తున్న బి ఆర్ ఎస్ పార్టీ వైపే ప్రజలందరూ ఉన్నారని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేడాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు శుక్రవారం ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే సమక్షంలో మోమిన్ పేట్ మండలం ఎన్కతలగ్రామానికి చెందిన . కమల్ నాథ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి,.విఠల్ రెడ్డి, సాయి గౌడ్, సిద్దు, భరత్, చంద్రయాన్ పల్లిగ్రామానికి చెందిన రమేష్ రెడ్డి, శ్రీను, బీరప్ప, జనార్దన్ రెడ్డి, లక్ష్మయ్య, రాకేష్, నాగరాజ్,మోమిన్ పేట్ మండల కేంద్రానికి చెందిన రామ్ రెడ్డి, వేణుగోపాల్ చారి ఉదయ్ కిరణ్ గౌడ్, రమేష్ గో గౌడ్, శంకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, నరేందర్ రెడ్డి, ప్రభాకర్, ఎజాస్, మల్ రెడ్డి,* మరియు వారి అనుచరులు 150 మంది బిజెపి పార్టీ నుండి బి ఆర్ ఎస్ పార్టీలో* చేరారు.ఎమ్మెల్యే బి.ఆర్.ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ.వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు డి వెంకట్ మండల రైతు బంధు అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ దళిత అవార్డు గ్రహీత బుచ్చయ్య మాజీ సర్పంచ్ శ్రీరాములు శనీశ్వర ఆలయ కమిటీ చైర్మన్ మైపాల్ రెడ్డి మండలంలోని సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.