Thursday, 5 November 2026

సచివాలయంలో లగడపాటికి తెలంగాణ షాక్‌

హైదరాబాద్‌: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు మరోసారి తెలంగాణ షాక్‌ తగిలిందిజ సచివాలయంలోని మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతుండగా రమేష్‌ అనే తెలంగాణ యువకుడు లగడపాటిని నిలదీశారు. ‘ తెలంగాణ భూములను కొల్లగొడుతూ, తెలంగాణనే అడ్డుకుంటావా’ అని ప్రశ్నించారు. దీంతో ఆయువకున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *