సచివాలయానికి డా.అంబేద్కర్ పేరు పెట్టాలి.

నేరడిగోండసెప్టెంబర్14(జనంసాక్షి):
నూతనంగా నిర్మించే తెలంగాణ రాష్ట్ర సచివాలయనికి భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ పెరు పెట్టాలని నెరడిగొండ మండల భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది.బుధవారం రోజున వారు మాట్లాడుతూ ఇటీవల ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ ని కలిసి దేశ రాజధానిలో నూతనంగా నిర్మించనున్న పార్లమెంటు భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని వినతి పత్రాన్ని ఇవ్వడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వానికి ఆ వినతి పత్రాన్ని పంపడం జరిగిందని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్తగా నిర్మించే సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఆయన  రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అందుకు కృతజ్ఞతగా ఆ మహానియుని పేరు పెట్టి ఆయన రుణాన్ని తీర్చుకోవాలని కోరారు.