హస్తినాపురంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి : ముద్దగౌని లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్
ఎల్బీనగర్ (జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షనీయమని బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్ అన్నారు. తెలంగాణ నూతన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టడాన్ని హర్షిస్తూ ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం చౌరస్తాలో ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల కోసం సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. అదేవిధంగా పార్లమెంట్ భవనానికి కూడా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరును పెట్టాలని ఆమె కోరారు. అంతకుముందు కేసీఆర్ కు అనుకూలంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కృష్ణ మాదిగ, , పాలకూర్ల యాదయ్య గౌడ్, సిలుమర్తి శేఖర్, సరస్వతి, సాయికుమార్ సూర్యవంశి, ,దంతోజు శ్రీనివాస్ చారి,లింగంగౌడ్, రాజుసాగర్, రాఘవేందర్ రజక,తోటపల్లి గిరి తదితులున్నారు..
Attachments area




