సదాశివపేట్, వెంకటాపూర్ లో బిజెపి బైక్ ర్యాలీ

పేద ప్రజలకు అండగా బిజెపి నిలబడుతుందని మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు అన్నారు. వెంకటాపూర్ లో జరిగిన ప్రజాగోష బిజెపి భరోసా కార్యక్రమానికి హాజరై విచ్చేసి ప్రసంగించారు. జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి శివరాజ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ బైక్ ర్యాలీకి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.