Monday, 2 November 2026

సమగ్రాభివృద్ది దిశగా తెలంగాణలో అడుగులు

నాలుగేళ్లుగా నిరంతర శ్రమ

సబ్బండ వర్గాలకు చేయూతనిచ్చే కార్యక్రమాలు

హైదరాబాద్‌,(జ‌నం సాక్షి): తెలంగాణలో అభివృద్ది సంక్షేమం ఇప్పుడు నినాదంగా సిఎం కెసిఆర్‌ ముందుకు సాగుతున్నారు. సబ్బండ వర్గాలను ఆదుకుంటూనే అభివృద్దికి బాటు వేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ మూడేళ్లలో గణనీయమైన ప్రగతి కళ్లకు కనిపిస్తోంది. ప్రధానంగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని సంకల్పించడం, అవి నిర్మాణ దశలో ఉండడం ఒక ఎత్తయితే వివాదాలు లేకుండా కార్యాచరణ చేస్తున్న తీరు అభినందనీయం. ప్రాజెక్టుల నిర్మాణంలో అంతర్‌ఆజతీయ దృష్టిని ఆకర్శిస్తూ వీటిపట్ల తనకున్న కమిట్‌మెంట్‌ను సిఎం కెసిఆర్‌ నిరూపించుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో 12 సంవత్సరాలు ఉద్యమం చేసి సాధించిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ వేస్తున్న ప్రతి అడుగూ అభివృద్దినే సూచిస్తున్నాయి. అయితే పాజిటవ్‌ దృక్పథంతో చూసే వారికి మాత్రమే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు కనిపిస్తాయి. నెగెటివ్‌ దృష్టితో చూసేవారు చేసే విమర్శలను పట్టించు కోవాల్సిన అవసరం లేదు. ఉద్యమ నాయకత్వానికీ పాలనాపరమైన నాయకత్వానికీ గల తేడాను చూస్తున్న వారు అభివృద్దిని పట్టించుకోవడం లేదు. కెసిఆర్‌ చేసిన వాగ్దానాలు అన్నీ ఈ నాగేళ్లలోనే పరిష్కారం కావాలని డిమాండ్‌ చేస్తున్న వారు తమ పదేళ్ల కాలంలో చేసిన ఒక్క మంచి పనిని చెప్పలేరు. ప్రభుత్వంపై అసహనం రోజురోజుకూ పెరుగుతుందని ప్రచారం చేస్తున్న వారు రాజకీయ విమర్శకులనిఓట్లేయించుకోవడానికే పథకాలంటూ ప్రచారం చేస్తున్నవారు లేకపోలేదు. అయితే వీరంతా ఈ సమాజంలో అణగారిన వర్గాలని గుర్తించాలి. వీరిని అందరితో సమానంగా గౌరవించే దిశగా ఆలోచన చేశారు. అందుకే ఒక్కో కులం నుంచి ఒక్కో ఎమ్మెల్సీ సీటు ఇస్తానని కూడా హావిూ ఇచ్చారు. కులసంఘాలకు ఆర్థిక చేయూత ఇచ్చారు. బడ్జెట్‌లో కులాల వారీ కేటాయింపులు కూడా ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సమగ్ర కుటుంబ సర్వేలో తెలంగాణ జనాభాలో 52 శాతం బీసీ జనాభా ఉందని తేలింది. తమవర్గాలకు అన్యయం జరుగుతోందని ఆర్‌.కృష్ణయ్య లాంటి వారు ఉద్యమిస్తున్నారు. ఈ తరుణంలో ఆయా వర్గాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత సిఎం కెసిఆర్‌పై ఉంది. అందుకే కేసీఆర్‌ సరికొత్త కుల ప్రణాళికలు రచించారు. దానికి అనుగుణంగానే బడ్జెట్‌ని కూడా రూపొందించారు. పనులు సరిగ్గా లేక గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు పెరగకుండా ఉండేందుకు చేతివృత్తులకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు. ఇలా చేయడం అన్నది ఆయా వర్గాలను స్వయం సమృద్ది చేసే దిశగా చేస్తున్న కార్యక్రమంగానే చూడాలి. రాష్ట్రం ఏర్పడిన తరువాత అంతా వడ్డించిన విస్తరిలా కనిపించినా పరిపాలన అనేది నల్లేరు విూద నడకలా సాగదని కెసిఆర్‌ అంటూనే ఉన్నారు. అందుకే అభివృద్దికి కట్టబడేలా మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకాలతో పాటు, కులవృత్తుల వారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ వచ్చారు. ఇవన్నీ సక్రమంగా సాగాలంటే అప్పులు తప్పడం లేదు. దీనిపైనా విమర్శలు వచ్చాయి. అందుకే ఇవి అప్పులు కావు, అభివృద్ధికి పెట్టుబడులు అని ప్రభుత్వం చెప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకు అప్పులు చేస్తున్నామో కూడా అసెంబ్లీ వేదికగా వివరణ ఇచ్చారు. ప్రతీ ఇంటికి త్రాగునీరు అందిస్తామన్న హావిూ మేరకు గ్రామాల్లో పనులు చురుకుగా సాగుతున్నాయి. ఎన్నికల్లో ఓటు అడగను అన్న ముఖ్యమంత్రి రెండు లక్షల డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు కట్టిస్తామని చెప్పి శరవేగంగా పనులు చేస్తున్నారు. ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకుంటానని, ప్రజాస్వామ్య సాంప్రదాయాలను పునరుద్ధరి స్తానని కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాగానే చెప్పారు. అయినా ఇంకా సమస్యలు అనేకం ఉన్నాయి. కాదని ఎవరూ అనడం లేదు. సిఎం కెసిఆర్‌ కూడా అన్నీ పరిష్కరించానని చెప్పడం లేదు. ప్రజల జీవితాలను బాగుపరిచే నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందించే ప్రయత్నం చేయడంతో బాటు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. పౌర సేవల చట్టాన్ని తీసుకురావడం, చట్టం న్యాయం అందరికీ సమానంగా అందించడం, పరిపాలన వికేంద్రీకరణ చేయడం, స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడం లాంటి సంస్కరణలు చేపట్టాలి. అలా చేసినప్పుడే పోరాడి సాధించుకున్న తెలంగాణ కల సాకారం కాగలదు. ఈ దిశగా చేస్తున్న ప్రయాణంలో అన్నీ రాత్రికి రాత్రి పరిష్కారం కావు. అయితే అడుగు పడిందని, అది సాగుతోందని మాత్రం చెపవచ్చు.