సమయపాలన పాటించని అధికారులు….
వైస్ ఎంపీపీ విశ్వంబెర స్వామి..
చిలప్ చెడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీపీ వినోద దుర్గారెడ్డి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ విశ్వంబర స్వామి మాట్లాడుతూ అధికారులు సమయపాలన పాటిస్తలేరని పై అధికారులు ఇలా పాటిస్తే కిందిస్థాయి అధికారులు ఇంకెలా ఉంటారో అని అడగగా ఇకనుంచి అటువంటి పొరపాటులు జరగకుండా సమయపాలన పాటిస్తామని అధికారులు చెప్పడం జరిగింది.మండల విద్యాధికారి బుచ్యనాయక్ మాట్లాడుతూ మండలానికి 11 స్కూలు మనఊరు మనబడి కార్యక్రమం ద్వారా సాంక్షన్ అయ్యాయి అన్నారు. 8 స్కూల్లో ఎంబిలు రికార్డ్ చేశారు. మెదక్ జిల్లాలో మనఊరు మనబడి లో చిలప్ చెడ్ మండలం ఉందన్నారు స్కూళ్లలో పనులు సక్రమంగా జరుగుతున్నాయి. పిఆర్ఏఈ మధుబాబు మాట్లాడుతూ ఎస్డిఎఫ్ నిధుల ద్వారా 460 లక్షలు,ఒక కోటి చిలప్ చెడ్ కు, 670 లక్షలతో శిలాంపల్లి నుండి అంతారం గేట్ వరకు బిటి రోడ్డు నిర్మాణం పనులు 30 శాతం పూర్తి అయింది మనఊరు మన బడిలో ఎనిమిది స్కూల్లో 80 శాతం పనులను పూర్తి చేసుకున్నాం 11 స్కూళ్లకు గాను 120 లక్షలు మంజూరైనాయి సర్పంచ్ బుజ్జి బాయ్ మాట్లాడుతూ పనిచేసిన 15 రోజుల్లో డబ్బులు ఇస్తామని చేప్పి ఎంబీలు రికార్డు చేస్తలేరని తెలిపారు. మిషన్ భగీరథ ఏఈ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో త్రాగునీటి కొరకు ఏడు ట్యాంకులు మంజూరయ్యాయని గౌతాపూర్ చిట్కుల గ్రామాలలో పనులు స్టార్ట్ చేశామన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ కూలీలు పనులు చేసిన వారికి సకాలంలో డబ్బులు అందరికీ అందేలా చూడాలని సర్పంచ్ మంతప్ప అశోక్ గౌడ్ తెలిపారు. బండపోతుల్ గ్రామంలో క్రీడా ప్రాంగణం డబ్బులు ఇంకా రాలేదని ఎంతవరకు రికార్డ్ చేశారోకుడా క్లారిటీ లేదని సర్పంచ్ ఇస్తారి కోఆప్షన్ సభ్యులు షఫీ అధికారులు అడిగారు ఎఫ్�