సమస్యలు పరిష్కరించెలా చూడాలనీ ఎమ్మేల్యేకు వినతి.
46వ రోజు నిరవదిక సమ్మెలో ఊరుకొండ వీఆర్ఏలు.
ఊరుకొండ, సెప్టెంబర్ 8 (జనం సాక్షి):
బహిరంగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలు, వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లు అమలయ్యేలా చూడాలని ఊరుకొండ మండల వీఆర్ఏ జే ఏ సి చైర్మన్ బీ.సత్తయ్య, వీఆర్ఏలందరూ కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. గురువారం ఊరుకొండ మండల కేంద్రంలో వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 46వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా ఊరుకొండ మండల వీఆర్ఏలు
ఈ సందర్భంగా న్యాయమైన డిమాండ్లను ఎమ్మెల్యేకు విన్నపించారు. వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలని, 55 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మరణించిన వీఆర్ఏల స్థానంలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని వాపోయారు. కార్యక్రమంలో ఊరుకొండ మండల వీఆర్ఏ జే ఏ సి చైర్మన్ బీ. సత్తయ్య, కో చైర్మన్ బీ.రమేష్ , జెర్నల్ సెక్రటరీ శేఖర్, కన్వినర్ డీ.శ్రీలత, కో కన్వినర్ లు సుల్తాన్. జంగయ్య, దశరథం. యాదయ్య, యాదమ్మ, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.