సమస్యల పరిష్కరానికి అధికారులు కృషి చేయాలి

జడ్పీటీసీ స్వప్నభాస్కర్
జహీరాబాద్ అక్టోబర్ 1( జనంసాక్షి) మండలం లో నెలకొన్న సమస్యల పరిష్కరానికి అధికారులు ప్రత్యేక కృషి చేయాలి అని జడ్పీటీసీ స్వప్నభాస్కర్ అన్నారు. శనివారం న్యాల్కల్ మండల కేంద్రం, మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ అంజమ్మ అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశం లో జడ్పీటీసీ స్వప్నభాస్కర్ మాట్లాడుతూ ఎన్ని సమావేశాలు జరుపుకున్న కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వలన గ్రామాలలోని పనులు అసంపూర్తిగానే ఉన్నాయన్నారు.ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయముతో పని చేసినపుడే మండలాన్ని అన్నీ రంగాలలో అభివృద్ధి చేసుకోవచ్చు అని కోరారు..కాబట్టి అధికారులు బాధ్యతాయుతంగా త్వరితగతంగా సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు..కార్యక్రమంలో ఎంపీపీ అంజమ్మ, వైస్ ఎంపీపీ గౌసొద్దీన్, ఎంపీడీఓ సుమతి,ఎంఆర్ఓ ఆంటోనీ,వివిధ గ్రామాల ఎంపీటీసీ లు..సర్పంచ్ లు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.