సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి – మంత్రి కేటీఆర్ కి విన్నవించిన జెడ్పీ చైర్మన్ పుట్ట మధు
జనంసాక్షి, మంథని : గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబాటుకు గురైన మంథని నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ని మంథని నియోజకవర్గ భీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ కోరారు. ఆసెంబ్లీ ప్రాంగణంలోని ఆయన చాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని పలు సమస్యలపై చర్చించారు. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారంతో పాటు అభివృధ్ది పనుల గురించి మంత్రిని కోరారు. తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పాలనలో నియోజకవర్గానికి అభివృధ్దిబాటలు పడ్డాయనే విషయాన్ని ఈ సందర్బంగా మంత్రి కి గుర్తు చేశారు.