ఎల్బీ నగర్ (జనం సాక్షి ) సమాజ సేవలో ప్రతిఒక్కరు పాల్గొని పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జడ్పిటిసి, జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్ పిలుపునిచ్చారు . గానుగుమర్ల గ్రామపంచాయతీలో గొడుగులు , దుప్పట్లు పంపిణీ చేశారు .కడ్తాల్ మండలంలోని గానుగుమర్ల గ్రామపంచాయతీలో పిఎసిఎస్ డైరెక్టర్ సేవ్య నాయక్, ఉపసర్పంచ్ శారద పాండులు. భారీ వర్షాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతుల, వృద్ధుల కోసం గొడుగులు, దుప్పట్లను డొనేట్ చేస్తున్నారు. ఈ గొడుగులు , దుప్పట్లను జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక జడ్పిటిసి, జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్ పాల్గొని, ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం గ్రామపంచాయతీలో తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్, సర్పంచ్ హంశ మోత్య, ఉపసర్పంచ్ శారదపాండు, వార్డుసభ్యులు, శ్రీను, శంకర్, భీమన్న, లక్ష్మీ గ్రామ కమిటీ అధ్యక్షులు పాండు, లక్పతి, టిక్ లాల్, రైతులు, వృద్ధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
సమాజ సేవలో ప్రతిఒక్కరు పాల్గొని పేదలను ఆదుకోవాలివ:దశరథ్ నాయక్




