సమావేశంలో మాట్లాడుతున్న యాదగిరి శేఖర్ రావు

గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలను ఆదుకోవాలి
ట్ర స్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు
చొప్పదండి, అక్టోబర్ 1 (జనం సాక్షి)…. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు అన్నారు. ఈ మేరకు మండల పరిధిలోని భూపాలపట్నం గ్రామంలోని సెయింట్ మదర్ తెరిసా పాఠశాలలో ట్ర స్మామండల శాఖ అధ్యక్షులు సింహాచలం జగన్మోహన్ స్వామి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనాకాలంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయని అన్నారు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని అన్నారు .ప్రభుత్వం నుండి ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరారు .ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు పుల్యాల లక్ష్మారెడ్డి కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు కోరం సంజీవరెడ్డి జగిత్యాల జిల్లా అధ్యక్షులు రవి ప్రసాద్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు శేశవరెడ్డి ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి నాయకులు గుర్రం రెడ్డి శ్రీనివాస్ .నాగోతు వినోద్ కుమార్ .కునమల దేవానంద్ .తమ్మడి కనకరాజు .కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి కడారి రవికుమార్ .కురుమచలం రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు