సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -బిఆర్ఎస్

 

మోత్కూరు ఆగస్టు 19 జనం సాక్షి : తెలంగాణ తొలి బహుజన విప్లవ వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారంనాడు మోత్కూరు లో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ, జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 16వ, శతాబ్దంలోనే పేద ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్న దొరల పెత్తందారుల వ్యతిరేకంగా బహుజన ఉద్యమాలకు ఊపిరిపోసిన గొప్ప వ్యక్తి సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి నియోజకవర్గ అధ్యక్షుడు అనంతుల దేవాంజీ గౌడ్, మున్సిపల్ కో -అప్షన్ సభ్యులు గనగాని నర్సింహ్మ, బీసీ సంఘం నాయకులు అవిశెట్టి అవిలిమల్లు , బుర్ర యాదయ్య ,బయ్యని రాజు,మెరుగు యాదగిరి, కలిమెల నర్సింహ్మ, నాగేశ్వర్ సునీల్ బీసు యాదగిరి తదితరులు పాల్గొన్నారు