సర్పంచ్ చేతుల మీదుగా ఏకరూప దుస్తులు పంపిణీ
అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 15) అలంపూర్ మండలపరిధిలోని ఊట్కూరు గ్రామంలోగురువారం మండల ప్రజా పరిషత్ పాఠశాల యందు ఏకరూప దుస్తుల పంపిణీ సర్పంచ్ అయ్య స్వామి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అయ్యా స్వామి మాట్లాడుతూ ఏకరూప దుస్తులు వలన ధనిక, బీద, అనే వ్యత్యాసం లేకుండా అందరూ సమానమనే భావన పిల్లలు కలగడానికి దుస్తులను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. బట్టల పంపిణీ కార్యక్రమంలో హెడ్మాస్టర్ బి వెంకటేశ్వర్లు, టీచర్ వెంకటేశ్వర్లు, బయన్న, విద్యా కమిటీ చైర్మన్ బేగం పాల్గొన్నారు.