Wednesday, 4 November 2026

తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాల వైభవంగా నిర్వహించాలి

ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్

ర్యాలీ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్

17 సెప్టెంబర్, 2022 నాటికి హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనమై 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా.తెలంగాణ ప్రజల పోరాటపటిమ, సంస్కృతి, సంప్రదాయాలు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఘనంగా చాటేలా తెలంగాణ జాతీయ సమైక్యతా వజోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ అన్నారు ఈ సందర్భంగా ఖానాపూర్ ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన అధికారుల సమక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రేపు సెప్టెంబర్ 16న ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉదయం 10 గంటలకు విద్యార్థులు, యువతీయువకులు, మహిళలతో ప్రజా ప్రజా ప్రతినిధులతో మార్కెట్ యార్డు నుండి తెలంగాణ తల్లి మరియు NTR చౌక్ మీదుగా భారీ ర్యాలి ప్రారంభం అవుతుందని ర్యాలీలో నియోజకవర్గం నుండి ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు నాయకులు పార్టీలకు అతీతంగా బారీ ర్యాలీనీ విజయవంతం చేయాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్ హేమంత్ బార్కడే తో కలిసి మార్కెట్ యార్డు ప్రాంగణాన్ని పరిశీలించారు.విద్యార్థులకు మహిళలకు ఎలాంటి ఇబ్బందులను కలవకుండా చూసుకోవాలని ఆదేశించారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని నడిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.