సర్వసభ్య సమావేశం నిర్వహించిన అధికారులు

 ప్రతిసారి డుమ్మా కొడుతున్న పలు శాఖల అధికారులు
 కడెం( జనం సాక్షి) సెప్టెంబర్ 20 కడెం మండల సర్వసభ్య సమావేశం మంగళవారం రోజు మధ్యాహ్నం ఎంపీపీ అలెగ్జాండర్  అధ్యక్షతన నిర్వహించారు సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా సాగింది ప్రజా ప్రతినిధులు పూర్తిస్థాయిలో హాజరైన పలు శాఖల అధికారులు   హాజరు  కాలేదు సమావేశంలో వైస్ ఎంపీపీ  కట్ట శ్యాంసుందర్ ధర్మాజీ పేట్ నుండి రేవోజీపేట్  వెళ్లే రహదారి దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ఇప్పటికి రెండు మూడు నెలలు అవుతున్నా అధికారులు సమస్యలను పరిష్కరించకపోవడం పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. విద్యుత్తు మిషన్ భగీరథ అధికారులపై సర్పంచులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు గ్రామంలో ఉన్న క్రిందికి వేలాడుతున్న తీగలను.   పడిపోయిన స్తంభాలను గురించి అధికారులకు తెలియజేసిన ఎలాంటి పని జరగలేదని వాపోయారు మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నాం అన్నది అబద్ధమని ఇంతవరకు మూడు సంవత్సరాల నుండి అల్లం పెళ్లి గ్రామంలో ఒక చుక్క నీరు కూడా వచ్చిన పాపాన పోలేదని సర్పంచ్ ఆగ్రహం  చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో గజానన్.   ఎంపీడీవో. ఆత్మ కమిటీ చైర్మన్ కానూరి సతీష్ . కో ఆప్షన్ నెంబర్  రఫిక్. సర్పంచులు ఎంపిటిసిలు  అధికారులు పాల్గొన్నారు
Attachments area