సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం మండల అధ్యక్షునిగా నర్స గౌడ్

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా మండల కేంద్రం చెందిన నగునూరి నరస గౌడ్ ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు జాగిర్ అంజి గౌడ్ బుధవారం నియామక పత్రాన్ని అందజేశారు. గౌడ సంక్షేమ సంఘానికి నర్సా గౌడ్ చేస్తున్న కృషిని గుర్తించి నర్సాగడును మండల అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం ఇటీవల మండల కేంద్రం చెందిన గీత కార్మికుడు గుర్రం నారాయణ వృత్తి రీత్యా తాటి చెట్టు పైనుండి పడితీవ్ర గాయాలు కాగా ఆయన ను సంఘం సభ్యులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు జాగిరి అంజి గౌడ్ యూత్ రాష్ట్ర సహాయ అధ్యక్షుడు ఇల్లందుల అంజి గౌడ్ ,ఉమ్మడి జిల్లా క్రమశిక్షణ అధ్యక్షులు వెంగలి రాజన్న గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లెర్ల శ్రీనివాస్ గౌడ్, జిల్లా వర్కింగ్ ఉపాధ్యక్షుడు బూరుగు మహేష్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు రంగు సత్యనారాయణ గౌడ్, రామగిరి మండల అధ్యక్షుడు మల్యాల మోహన్ గౌడ్, నాయకులు బొంగని సదయ్య, బుర్ర సత్యం గర్రెపల్లి వెంకన్న ,కమ్మగోని రాజన్న తదితరులు ఉన్నారు.

తాజావార్తలు