జిల్లా సహకారశాఖ అధికారి శ్రీనివాసరావు
మేడ్చల్,డిసెంబర్25(జనంసాక్షి): సహకార సంఘాల పాలక వర్గాలకు ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలోని తొమ్మిది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. తుది ఓటర్ జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు తెలుపాలని, ఇట్టి అభ్యంతరాలను ఈ నెల 28లోపు పరిష్కరించడంతోపాటు 30వ తేదీన రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ సమర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.




