*సాగు చేసుకుంటున్న భూములను దళితులకు పట్టాలు అందించాలి.

*ఏవైఎస్, సి పి ఐ ఎం ఎల్ రాష్ట్ర నాయకులు డిమాండ్ .
చిట్యాల (జనం సాక్షి )జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములను, పోడు భూములను దళితులకు పట్టాలు అందించాలని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య, సి పి ఐ ఎం ఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు మారేపల్లి మల్లేష్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు
 గురువారం మండల తహసీల్దార్ శ్రీనివాసరెడ్డికి సాగు చేసుకుంటున్న భూములను దళితులకు పట్టాలు చెయ్యాలని వినతిపత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు భూములతో పాటు పోడు భూములు, ఫారెస్టులో మిగిలిన భూములను దళితులకు పట్టాలు చెయ్యాలన్నారు. సాగు చేసుకుంటున్న దళితుల భూములను సాగు చెయ్యద్దనిఫారెస్టు అధికారులు దాడులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఫారెస్టు అధికారులతో పాటు ప్రభుత్వం దళితులను ఇబ్బందులకు గురి చేస్తే ఉద్యోగం నుంచి తొలగించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకునే వరకు ధర్నాలు, రాస్తారోకోలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున దళితులతో చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్  సాగు చేసుకుంటున్న భూములతో పాటు, పోడు భూములను న్యాయ బధ్ధంగా పట్టాల ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్, సంగి రాజు తదితరులు పాల్గొన్నారు
Attachments area