సాఫ్ట్ వేర్ రంగంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి.జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : బుధవారం రోజున తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు HCL టెక్ బీ సంస్థ వారు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నాడు. 2021-22 సంవత్సరంలో ఇంటర్మీడియేట్ మాథమెటిక్స్ విభాగంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ జాబ్ మేళాకు అర్హులని, HCL సంస్థ దేశవ్యాప్తంగా ఉద్యోగ మేళ కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. సాఫ్ట్ వేర్ రంగంలో మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని ఉన్నతావకాశాలు సంపాదించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక సహకారం కు యువతకు తోడ్పాటు అందిస్తున్నదని, ప్రభుత్వం చేపట్టి శిక్షణ, అభివృద్ధి కార్యక్రమాలు యువత సద్వినియోగం చేసుకొని ఉపాది అవకాశాలను సంపాదించుకోవాలని అన్నారు. ఈ మేళ లో ఎంపిక అయిన అభ్యర్ధులకు వారి అర్హతను బట్టి వేతనం చెల్లించడం జరుగుతుందని సూచించారు. మెంటర్స్ యువతకు సహకరించాలని సూచించారు. ఎంపిక అయిన అభ్యర్థులు వారి ఉద్యోగంతో పాటు ఉన్నత చదువులకు అవకాశం ఉంటుందని సూచన ప్రాయంగా.. తెలిపారు. అంతకుముందు కలెక్టర్ కు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖ అధికారి రవీందర్ కుమార్, HCL సిబ్బంది, RCO, తదితరులు పాల్గొన్నారు.