సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం

సునీతమ్మ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు శివశంకర్ రావు

హత్నూర (జనం సాక్షి)
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ (సునితా లక్ష్మారెడ్డి) సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని ఆ సంస్థ అధ్యక్షుడు బాదె శివశంకర్ రావు అన్నారు.మండలంలోని మల్కాపూర్, చందాపూర్,బోర్పట్ల,పల్పనూర్,గుండ్లమాచునూర్, తుర్కల ఖానాపూర్,ముచ్చర్ల,సాదుల్ నగర్,వడ్డేపల్లి, కోనంపేట,రెడ్డి పాలెం,దౌల్తాబాద్, మంగాపూర్,దేవుల పల్లి గ్రామాల ప్రయాణ ప్రాంగణాల వద్ద వృద్ధులు, ప్రయాణికుల సౌకర్యార్థం ఆదివారం సంస్థ ఆధ్వర్యంలో 30 సిమెంటు బెంచీలను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా శివశంకర్ రావు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు పేద ప్రజలకు ఆసరాగా సంస్థ నిలబడుతుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో యాదయ్య,నర్సింలు,దుర్గయ్య తదితరులు ఉన్నారు.